స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో శ్రీనివాస్ గౌడ్‌కు ఈ కేసులో ఊరట లభించినట్లైంది. శ్రీనివాస్‌గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని రాఘవేంద్ర హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సోమవారం రోజున మరోసారి విచారణ జరిపి ఈ వివాదంపై తీర్పు మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇవాళ రాఘవేంద్ర వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో ఊరట.. పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
0
495
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


