అవతార్ హీరోయిన్…నిన్న-నేడు

తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి అక్కడ ఉండలేక పిల్లల్ని తీసుకుని వలస బాట పట్టింది. అలా చిన్నతనంలో తను ఎన్నో కష్టాలు పడి, అప్పుడే డ్యాన్స్ పై ఇష్టం పెంచుకుని…డ్రామా ఆర్టిస్ట్ అవతారం ఎత్తింది. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడి, చివరికి ఇప్పుడు హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిన అవతార్ హీరోయిన్ సంగతులు మీకోసం…

ఇంతకీ తన పేరేమిటంటే… ‘జో సాల్దానా’

44 సంవత్సరాల జో సాల్దానా 1978 జూన్ 19న న్యూజెర్సీలో జన్మించింది. చిన్నతనంలో తండ్రి మరణించాడు. బతుకుతెరువు కోసం జో కుటుంబం అక్కడ నుంచి డొమెనికన్ రిపబ్లిక్ కు వలస వెళ్లింది. అక్కడే జో జీవితం మలుపు తిరిగింది. తనకు డ్యాన్స్ అంటే ఇష్టం కావడంతో డాన్స్ సబ్జక్టుగా డిగ్రీ పూర్తి చేసింది.

అప్పుడు తను మళ్లీ అమెరికాకు తిరిగి వచ్చింది. న్యూయార్క్ సిటీలో నాటకాలు వేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. కొందరి స్నేహితుల సహాయంతో సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లింది. అవకాశాలు అంత ఈజీగా తలుపు తట్టలేదు. అందుకే మొదట ‘లా అండ్ ఆర్డర్’ అనే టీవీ షో లో నటించి గుర్తింపు పొందింది. అలా వెండితెరపై అవకాశం దక్కించుకుని ‘సెంటర్ స్టేజ్’ అనే సినిమాలో తొలిసారి నటించింది.

నటన పరంగా మంచి మార్కులు పడటంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. క్రాస్ రోడ్స్, గార్డియన్ ఆఫ్ గెలాక్సీ, గెట్ ఓవర్ ఇట్, ది టర్మినల్, డర్టీ డీడ్స్, హెవెన్, యూనిటీ ఇలా పలు చిత్రాల్లో నటించింది.

ఈ సమయంలో ‘స్టార్ ట్రెక్’ అనే సినిమా జో కెరీర్ ని మలుపు తిప్పింది. ఇక్కడే దర్శకుడు జేమ్స్ కెమరాన్ దృష్టిలో పడింది. అలా సెల్యూలాయిడ్ వండర్ ‘అవతార్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని అందిపుచ్చుంది. ఇకంతే ప్రపంచవ్యాప్తంగా తనకి ఫాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అంతేకాదు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వరించాయి. ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో జో సాల్దానా ముందు వరుసలో ఉంది.  ఇప్పుడు అవతార్-2 సినిమా అద్భుతంగా ఉందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. మరోసారి జో సాల్దానా పేరు ప్రపంచానికి వినిపించింది.

చివరిగా తన కుటుంబం గురించి చెప్పాలంటే  ఇటాలియన్ ఆర్టిస్ట్ ‘మార్కో పెరెగోని’ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తను స్పానిష్, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది. తన పిల్లలు ఈ రెండు భాషలతో పాటు ఇటాలియన్ కూడా నేర్చుకుంటున్నారంట.

అలాగే జో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. మహిళల కోసం పనిచేసే ‘ఫిన్ కా’ అనే స్వచ్చంద సంస్థలో కలిసి పని చేస్తోంది. ఇంకా తన ఇష్టాలగురించి చెప్పాలంటే తనకి చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టమంట. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ ఫుడ్ చక్కగా తింటానని నవ్వుతూ చెబుతుంటుంది.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్