ప్రధాని మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు- కేటీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్:  తనను ఆశీర్వదించాలని తన తండ్రి, సీఎం కేసీఆర్ చెప్పారని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని, తాను ముఖ్యమంత్రి కావడానికి ఆయన అనుమతి అక్కరలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడు పదుల వయస్సులో ప్రధాని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఈ అబద్ధాలతో ఆయన తన పదవి గౌరవాన్ని తగ్గించుకున్నారన్నారు. నిజామాబాద్ సభలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన యాక్టింగ్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్ట్ రాస్తే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయన్నారు.

తెలంగాణ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఇక నుంచి ఎవరైనా ప్రధాని మోదీని కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణను రికార్డ్ చేసుకుంటే మంచిదన్నారు. ఎన్డీయేలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదని, ఆ కూటమి నుంచే పార్టీలు బయటకు వచ్చాయన్నారు.

ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన పార్టీల పైకి ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారిపై ఏమైనా కేసులు ఉంటే వెనక్కి పడిపోతున్నాయన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జూమ్లా పార్టీ అని విమర్శించారు. ఎన్డీయే మునిగిపోయే నావ అని, అలాంటి దానిని ఎక్కాలని ఎవరూ అనుకోరన్నారు.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్