దమ్ముంటే వీడియోలు బయటపెట్టు.. బండారుకి రోజా భర్త సెల్వమణి సవాల్

స్వతంత్ర వెబ్ డెస్క్:  తన భార్య రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇలా అనుచితంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాగే మాట్లాడారని మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి అన్నారు. తన భార్య బలంగా పోరాడుతున్నారని, అందుకే ఆమెను మానసికంగా దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారన్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వీళ్లు ఎన్ని రోజులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు? అని ప్రశ్నించారు.
తాను బండారు సత్యనారాయణకు సవాల్ చేస్తున్నానని, మీ వద్ద ఏమైనా వీడియోలు ఉంటే కచ్చితంగా బయట పెట్టవచ్చునన్నారు. మా కోసం ఆగాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి బెదిరింపులు, నీచమైన పనులు తమకు వద్దన్నారు. అసలు టీడీపీ పార్టీకే ఇలాంటి జబ్బు ఉందేమో అన్నారు. ఇంతకుముందు కూడా కొంతమంది ఇలాగే మాట్లాడారన్నారు.

రోజా మంచి ఫైటర్ కాబట్టి, ఆమెను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బండారు వద్ద ఏవైనా ఉంటే ధైర్యంగా బయటపెట్టాలని, అలాంటి వాటిని తాము ఫేస్ చేస్తామన్నారు. మగాడు అంటే చెప్పినమాట మీద ఉండేవాడన్నారు.

Latest Articles

తెలంగాణ భవన్‌ వద్ద టెన్షన్‌… బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధం

తెలంగాణ భవన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. భవనం చుట్టూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా బాల్క సుమన్‌ తెలంగాణ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్