అక్టోబర్ 6న వస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’

గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న సినిమాలు, సహజత్వమైన కథలతో తెరకెక్కుతున్న చిత్రాలు జనాల ఆదరణను దక్కించుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అంటూ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. సునీత పాడిన పాట అయితే అందరినీ కదిలించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇలా ప్రతీ విషయంలో సినిమా మీద ఆసక్తిని పెంచేలా ప్రమోషన్స్ చేసింది యూనిట్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 6న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్ : గంగాధర. టి
కెమెరామెన్ : సతీష్‌ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ : జేపీ
డీఐ : పీవీబీ భూషణ్
పీఆర్ఓ : సాయి సతీష్

Latest Articles

హైదరాబాద్‌ బొల్లారం మహిళ హత్య కేసులో కీలక మలుపు.. భర్తే హత్య చేశాడని నిర్ధారణ

హైదరాబాద్‌ బొల్లారం ప్రాంతంలో మహిళ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తన భార్యను హత్య చేశారని భర్త అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూరగాయల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్