నోటుకు సీటు.. రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు

స్వతంత్ర వెబ్ డెస్క్:  కాంగ్రెస్‌లో నోటుకు సీటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై సంచలన ఆరోపణ చేశారు కాంగ్రెస్‌ నేత కొత్త మనోహర్ రెడ్డి. మహేశ్వరం టికెట్ కోసం బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డి దగ్గర.. రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని కొత్త మనోహర్‌ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయం సీనియర్ లీడర్ వి.హెచ్‌. కూడా తనతో చెప్పారన్నారు. సమయం వచ్చినపుడు సాక్ష్యాలతో సహా బయటపెడతానన్నారు మనోహర్‌ రెడ్డి. ఇప్పుడు ఈ అంశం కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మహేశ్వరం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఐదుగురు నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహుల్లో డీసీసీ చీఫ్‌ చల్లా నర్సింహరెడ్డి, కొత్త మనోహర్‌ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్మేటి అమరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే మహేశ్వరం టికెట్‌ బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహరెడ్డికి టికెట్‌ కన్ఫామ్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యవహరంపై పార్టీ సీనియర్లను ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారని తెలుస్తోంది. మహేశ్వరం టికెట్ ఇంకా ఎవరికీ కన్ఫామ్‌ చేయలేదని చెప్తున్నారు. చిగురింత పారిజాతకు టికెట్‌ కన్ఫామ్‌ అయిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు.

Latest Articles

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం 'చెరువుకొమ్ముపాలెం'లో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన చిన్నారులు ఇల్లా దినేష్(10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12),...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్