అక్టోబర్ 13న ‘పేమ విమానం’

భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ రూపొందిస్తోన్న ‘పేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైంది.ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు .. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా ఆసక్తిని పెంపొందించాయి.

సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.

నటీనటులు : సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు

సాంకేతిక బృందం:

సమర్పణ : దేవాన్ష్ ; నామా నిర్మాత : అభిషేక్ పిక్చర్స్, జీ5 ; నిర్మాత : అభిషేక్ నామా; దర్శకత్వం : సంతోష్ కటా; సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్; సినిమాటోగ్రాఫర్ : జగదీష్‌ చీకటి; ఎడిటర్ : అమర్ రెడ్డి; ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్; సీఈఓ : వాసు పోతిని; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రాల్యని, పి.ఆర్.ఒ: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్