29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

‘అతిథి’లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు: వేణు తొట్టెంపూడి

వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ “అతిథి”. ఈ వెబ్ సిరీస్‌ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దర్శకుడు భరత్ వైజీ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోని ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ ను మీడియాకు ప్రివ్యూ వేశారు. ఆ తర్వాత టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు భరత్ వైజీ మాట్లాడుతూ – ‘‘అతిథి వెబ్ సిరీస్ కథకు నా రియల్ లైఫ్ లో చూసిన ఒక ఇన్సిడెంట్ స్ఫూర్తినిచ్చింది. మా ఊరి దగ్గర ఒక బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ ఉన్న రోడ్డులో చింత చెట్లు వరుసగా ఉండేవి. ఆ రోడ్డులో వెళ్లిన ప్రతి వెహికల్ ఆగిపోయేది. దాంతో భయంగా అటు వైపు ఎవరూ వెళ్లేవారు కాదు. ఆ పాయింట్ అతిథి కథలో బేస్ చేసుకున్నాను. ముందు ఈ కథలో హీరో క్యారెక్టర్ కోసం సౌత్, నార్త్ నుంచి చాలా మంది ఆర్టిస్టులను అనుకున్నాం. కన్నడ హీరో ఉపేంద్రను తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ టైమ్ లో పునీత్ గారు మృతి చెందారు. కన్నడ ఇండస్ట్రీ బాధలో ఉంది. ఇలాంటి టైమ్ లో వద్దనుకుని..నార్త్, సౌత్ పర్సన్ ఫీచర్స్ ఉన్న వారి కోసం చూశాం. మా డిస్కషన్స్ లో వేణు గారి పేరు వచ్చింది. ఆయనను అప్రోచ్ అయి స్క్రిప్ట్ పంపాం. వేణు గారికి కథ నచ్చి చేస్తానని ముందుకొచ్చారు. మీరు ఇప్పుడు చూసిన ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ తర్వాత అసలు స్టోరీ, ట్విస్ట్ లు మొదలవుతాయి. ఈ వెబ్ సిరీస్ కోసం రామెజీ ఫిలిం సిటీలో సెట్ వేశాం. చాలా న్యాచురల్ గా సెట్ వచ్చింది. ఈ సిరీస్ మొదలయ్యేప్పుడు వేణు గారు ఒకటే మాట చెప్పారు. నాకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టే ఒక్క సీన్ కూడా ఉండకూడదు అని. నేను అదే ఫాలో అయ్యాను. వేణు గారి పర్ ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మన తెలుగులో హారర్ మూవీస్ తక్కువ. ఎప్పుడో ఆర్జీవీ దెయ్యం చూశాం. ఇది అండర్ కరెంట్ గా హారర్ ఉంటూ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ నెల 19న మా అతిథి చూడండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు.’’ అన్నారు.

హీరో వేణు మాట్లాడుతూ – ‘‘కరోనా టైమ్‌లో వెబ్ సిరీస్‌లు చాలా చూశాను. అప్పుడే ఒక వెబ్ సిరీస్ చేయాలని అనుకున్నాను. ఆ టైమ్‌లో అతిథి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ చాలా బాగుంది. అయితే దీన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా చేయాలని చెప్పాను. ఎందుకంటే ఇవాళ ఓటీటీలో చాలా కంటెంట్ వస్తోంది కానీ ఎవరికి వారు గదుల్లో ఉండి చూస్తున్నారు. అడల్ట్ కంటెంట్ ఉంటోంది. అందుకే అలాంటివి లేకుండా చేయాలన్నాను. భరత్ అలాగే చేశాడు. అతిథి వెబ్ సిరీస్ ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ నేను టెక్నీషియన్స్‌కు ఇస్తాను. భరత్ ఎంతో కష్టపడ్డాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ మనోజ్ ప్రతి సీన్ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. వెంకటేష్ కాకుమానుకు మంచి పేరొస్తుంది. హనుమాన్ జంక్షన్‌లో నేను ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నానో ఈ వెబ్ సిరీస్‌తో వెంకటేష్‌కు అలా పేరొస్తుంది. రవివర్మ మంచి క్యారెక్టర్ చేశాడు. అతిథిలో హారర్, కామెడీ ఇవన్నీ పక్కన పెడితే అందరూ కలిసి హాయిగా చూడగలిగే కథ ఇది. నాకు కథ నచ్చే సిరీస్ ఒప్పుకున్నాను. కెరీర్‌లో ఒక ఫేజ్ చూశాను. ఇప్పుడు విభిన్నమైన క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. ఇకపైనా మంచి కథలు వస్తే వెబ్ సిరీస్ చేస్తాను. నా ఫ్రెండ్ త్రివిక్రమ్ నేను ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. మాకు ఒకరి గురించి మరొకరికి తెలుసు. ఆయన సినిమాల్లో నాకు సరిపోయే క్యారెక్టర్ ఉంటే తప్పకుండా పిలుస్తాడు. ఆయన సినిమాలో చేయడం నాకూ చాలా ఇష్టం.’’ అన్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ – ‘‘అతిథిలో అవకాశం ఇచ్చిన డిస్నీ హాట్ స్టార్, భరత్ కు థాంక్స్. హాట్ స్టార్ లో 9 అవర్స్ వెబ్ సిరీస్ చేశాను. అతిథిలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. అతిథిలో హారర్ అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశంలోని ట్విస్ట్, డెప్త్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. భయపెట్టే దెయ్యాలు, అలాంటివి ఉండవు. మీరు పిల్లల్ని దగ్గర కూర్చో బెట్టుకుని కూడా అతిథి చూడొచ్చు. ఇప్పుడు రెండు ఎపిసోడ్స్ చూసిన వారు మళ్లీ మొదటి నుంచి చూడండి. థర్డ్ ఎపిసోడ్ నుంచి మంచి ట్విస్ట్స్ ఉంటాయి. నా కెరీర్‌లో బ్యాడ్ క్యారెక్టర్స్ చేయడం తగ్గించాలని అనుకుంటున్నా.’’ అన్నారు. సినిమటోగ్రాఫర్ మనోజ్, యాక్టర్ వెంకటేష్ కాకుమాను తదితరులు ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు.

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్