MAD: సింగిల్స్ కోసం స్పెషల్ సాంగ్ వచ్చేసింది!

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మునుపెన్నడూ చూడని తరహాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి సిద్ధమవుతోంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాతో సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయమవుతున్నారు.

ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌‌పై సాయి సౌజన్య ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మ్యాడ్ సినిమా నుంచి తాజాగా “ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్” అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ పాట జీవితంలో మింగిల్ కాకుండా.. సింగిల్‌గా సంతోషంగా, గర్వంగా ఎలా ఉండవచ్చో ప్రధాన పాత్రలకు వివరిస్తున్నట్టుగా సాగింది. ‘ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్’ పాట సంగీతం ఎవరితోనైనా కాలు కదిపించేలా ఉంది. ఇక సాహిత్యం యువత మెచ్చేలా.. ముఖ్యంగా లింగభేదాలు లేకుండా ప్రతి యొక్క సింగిల్‌ని కట్టిపడేసేలా ఉంది.

ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్’ పాట ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది.

తారాగణం:

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్. నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
ఆర్ట్: రామ్ అరసవిల్లి
అడిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
ఫైట్ మాస్టర్: కరుణాకర్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest Articles

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం.!

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్‌లో అంతర్గత...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్