బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే చేతికి చిప్పే- కిషన్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: ధనికరాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేసీఆర్‌ పాలనలో పూర్తిగా దివాలా తీసిందని.. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మళ్లీ కేసీ ఆర్‌ను గెలిపిస్తే ప్రజల చేతికి చిప్పే మిగులుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా సంగా రెడ్డిలోని అంబేడ్కర్‌ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభలో ఆయన ప్రసంగించారు.
ప్రభుత్వం వద్ద డబ్బులు లేక మద్యం టెండర్లు 6 నెలలు ముందు నిర్వహించిందని,  ఓఆర్‌ఆర్‌ టెండర్లతో వచ్చిన డబ్బులతో జీతా లు చెల్లించాల్సి వస్తోందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల తీరును ఆయన తీవ్రంగా విమ ర్శించారు. కాంగ్రెస్‌ సోని యా కుటుంబం కోసం..బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ కుటుంబం కోసం..ఎంఐఎం ఒవైసీ కుటుంబం కోసం పనిచేస్తాయని చెప్పారు. ఒక్క బీజేపీ మాత్రమే అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు.

సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.పది లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని పార్టీల ఖర్చులను తానే భరిస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్