సిద్ధంగా ఉండండి.. మరో 3 రోజులు వర్షాలే వర్షాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాకాలంలో 20 శాతం అధిక వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మి.మీ కాగా… ఇప్పటి వరకు 723.1 మి.మీ వర్షపాతం నమోదయిందని వెల్లడించింది.

Latest Articles

అమెరికాలో హెలికాప్టర్‌ ప్రమాదంలో భారతీయ సంతతి యువకుడు మృతి.. పెళ్లైన కొన్ని గంటలకే

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారతీయ మూలాలున్న ఓ యువకుడు వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే దుర్మరణం చెందాడు. కేరళకు చెందిన కుటుంబ నేపథ్యం కలిగిన 26 ఏళ్ల డేవ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్