కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో నేడు కీలక పరిణామం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కసరత్తులో వేగం పెంచింది కాంగ్రెస్‌ పార్టీ(Congress party)  ఇవాళ  స్క్రీనింగ్ కమిటీ(Screening Committee) ముందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక చేరనుంది. గాంధీభవన్‌లో ఉదయం 11 నుంచి పీఈసీ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశం కానుంది స్క్రీనింగ్ కమిటీ. సాయంత్రం వరకు ఈ ముఖాముఖి సమావేశాలు కొనసాగుతున్నాయి.  ఇదిలా ఉంటే.. ప్రదేశ్‌ఎన్నికల కమిటీ సభ్యులు నిన్నంతా గాంధీభవన్‌లో తమ తమ అభిప్రాయాలతో అభ్యర్థుల పేర్లతో నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లకు ముందు టిక్‌ను ఉంచారు వాళ్లంతా.

దీంతో.. ఇవాళ పీఈసీ(PEC) సభ్యులతో సమావేశమై.. ఆ సీల్డ్‌ కవర్‌ను పరిశీలిస్తుంది. వాళ్ల నుంచి ఆయా అభ్యర్థుల ఎంపికకు గల కారణాలను అడిగి తెలుసుకుంటుంది స్క్రీనింగ్‌ కమిటీ. ఇక రేపు(మంగళవారం) గాంధీ భవన్‌లోనే.. రేపు పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అవుతుంది. పీఈసీ,ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేస్తుంది. చివరకు.. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాతే కాంగ్రెస్‌ తరపున అభ్యర్థుల జాబితా ప్రకటన వెలువడనుంది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్