స్వతంత్ర వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది. సూర్యుడిపై (Sun) అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1(Aditya L1)ను ప్రయోగించనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఇందుకు వేదిక కానున్నది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇప్పటికే ప్రయోగ రిహార్సల్ విజయవంతం అవగా.. కౌంట్‌డౌన్ ప్రక్రియ కూడా మొదలైంది. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే సరిగ్గా ఉదయం 11.50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది.
సర్వం సిద్ధం.. అందరి ఆశలూ ‘ఆదిత్య ఎల్1’ పైనే..!
0
529
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


