స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ ఎప్పుడూ జాతీయ భావంతో ఉండే పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu) స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలతో టీడీపీకి(TDP) ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తాను కేంద్రంతో విభేదించింది కేవలం ప్రత్యేక హోదా అంశంపైనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా అంశాల్లో కేంద్రంతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పానని వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద సమస్య జగన్(CM Jagan) అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది అని వ్యాఖ్యానించారు.
మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
0
356
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


