MLA Chennamaneni: ఎమ్మెల్యే చెన్నమనేనికి కేబినెట్ హోదాతో కీలక పదవి

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో రాజకీయ వాతావరణం రంజుగా మారింది. కేసీఆర్‌(KCR) ఇటీవలే  ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశావహులు.. తమకు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరైతే  బహిరంగంగానే బీఆర్‌ఎస్‌(BRS) అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈసారి టికెట్‌ దక్కని వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబుకు(Ramesh Babu) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పజెప్పారు.

రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఆయన్ను నియమించారు. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో రమేష్ బాబు ఐదేళ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనుంది. విద్యాధికుడైన చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక హంబోల్ట్ యునివర్సిటీ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’లో పరిశోధనలు చేసి హీహెచ్‌డీ పట్టాను పొందారు.
రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా రమేష్ బాబుకు అగ్రికల్చర్ ఎకానమీ అంశం పట్ల ఉన్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్