ఇరవై రెండేళ్ల క్రితం ‘గదర్’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సన్నీడియోల్..ఇప్పుడు దీని సీక్వెల్‌తోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన గదర్2 ఆగస్టు 11న విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 229 కోట్ల కలెక్షన్స్‌కు చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. గత పదేళ్లలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తారా సింగ్ పాత్రలో మరోసారి కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీడియోల్ మూవీ ప్రమోషన్ కోసం బుధవారం హైదరాబాద్ వచ్చారు. టాలీవుడ్ మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి సన్నీడియోల్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించగ.. ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అనిల్ శర్మ, కమల్ ముకుత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
గదర్2 కోసం హైదరాబాద్‌కు వచ్చిన సన్నీడియోల్
0
507
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


