మామా మేము వచ్చేస్తున్నాం.. జాబిల్లికి మరింత చేరువలో చంద్రయాన్-3

స్వతంత్ర వెబ్ డెస్క్: జాబిల్లిపై పరిశోధనలకు రోదసీ లోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3(Chandrayan-3)  లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. బుధవారం జాబిల్లి చివరి కక్షలోకి ప్రవేశించింది. చంద్రయాన్- 3 కక్ష తగ్గింపు విన్యాసాన్ని బుధవారం మరోసారి విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో(ISRO) ప్రకటించింది. నేటి విన్యాసంతో కక్ష తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్షను 153 కిమీ x 163 కిమీలకు తగ్గించినట్టు ఇస్రో వెల్లడించింది.

దీంతో ఈ అంతరిక్ష నౌక ఇప్పుడు చంద్రుడిపై 100 కిలో మీటర్ల ఎత్తున ఉన్న కక్ష లోకి చేరింది. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక ఆగస్టు 17న వ్యోమనౌక లోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపడతారు. అది సజావుగా జరిగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5:47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్