నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ.. బీఆర్‌ఎస్‌లోకి జగ్గారెడ్డి..?

స్వతంత్ర వెబ్ డెస్క్: సంగారెడ్డి(Sangareddy) కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్‌లో(BRS) చేరునున్నట్టు తెలుస్తోంది. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్‌ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నా​యి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌(Congress) అధిష్టానం రేవంత్‌ రెడ్డిని(Revanth Reddy) టీపీసీసీ(TPCC) చీఫ్‌గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్‌ హైకమాండ్‌కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం.

 

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్