Basara IIIT: వరుస ఆత్మహత్యలు.. వీసీ కీలక నిర్ణయం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) విద్యార్థుల వరుస ఆత్మహత్యల(Suicide) నేపథ్యంలో ఇంఛార్జ్ వీసీ వెంకట రమణ (Venkata Ramana)అప్రమత్తమయ్యారు. రెండు నెలల వ్యవధిలోనే పీయూసీ-1 (PUC-1,)చదువుతోన్న ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటంతో.. వీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీయూసీ వన్ విద్యార్థులకు ఈ నెల 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.

విద్యార్థులు తల్లిదండ్రులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన పిల్లలు బాసర ట్రిపుల్ ఐటీలో ఉండగలరని అనుకుంటేనే తిరిగి పంపాలని ఆయన పేరెంట్స్‌కు సూచించారు. ఆర్జీకేయూటీ (RGKUT)కొత్త విధానాలపై తల్లిదండ్రులతో వీసీ చర్చించారు. ఇక్కడ ఉండేందుకు విద్యార్థులు మానసికంగా సిద్ధంగా లేరని వీసీ తెలిపారు. ఇక నుంచి ప్రతి శనివారం వీకెండ్ విత్ వీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా స్టూడెంట్స్ తమ సమస్యలను నేరుగా వీసీతో చెప్పుకునే అవకాశం లభించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం కోసం ఇక నుంచి ప్రతి శనివారం విలేజ్ టూర్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన నిర్ణయించారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్