ఇది విన్నారా.. రూపాయికే బస్సు ప్రయాణం.. దేశమంతా తిరగొచ్చు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: న్యూగో సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంటర్‌–సిటీ ఎలక్ట్రిక్‌ ఏసీ కోచ్‌ ( Inter-City Electric) సేవలందించే న్యూగో సంస్థ (Newgo Corporation) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా గ్రీన్‌సెల్‌ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా(Devendra Chawla) మాట్లాడుతూ..పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

పంద్రాగస్టు రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్‌ మొదలయ్యాయని, రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తమ రవాణా సేవలు కొనసాగుతున్నాయన్నారు.  దేశవ్యాప్తంగా ఇండోర్‌– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు. బుకింగ్స్‌ కోసం న్యూగో వెబ్‌సైట్‌ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్‌ అప్లికేషన్లలోనూ బుకింగ్‌ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్