దోచుకుంది… దాచుకుంది చంద్రబాబే.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandra Babu) మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సీరియస్‌ అయ్యారు. ప్రాజెక్టులపై యుద్ధం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. సెల్‌ఫోన్‌ కనిపెట్టిన చంద్రబాబుకు సెల్ఫీ తీసుకోవడం కష్టమవుతోందని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ కన్నా చంద్రబాబు గొప్పగా నటిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌(Ysr) ప్రారంభించికపోతే పోలవరం ప్రాజెక్ట్‌ ఉండేది కాదు. పోలవరాన్ని చంద్రబాబు నాశనం చేశారు. పోలవరంపై రామోజీరావు విషం కక్కుతున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీరావు(Ramojirao) బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో జరిగిపోతున్నట్టు రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారు. పోలవరంపై ఎప్పుడూ మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దోచుకుంది, దాచుకుంది చంద్రబాబు హయాంలోనే జరిగింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో మేము ప్రజా ధనం ఆదా చేస్తున్నాం అని స్పష్టం చేశారు. పుంగనూరులో పోలీసులపై హత్యాయత్నం జరిగింది. చంద్రబాబు వల్ల ఒక కానిస్టేబుల్‌ కళ్లు కోల్పోయారు. పుంగనూరు(Ponganooru) ఘటనపై సీబీఐ విచారణ అడగటం సిగ్గుచేటు. అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ వద్దన్నది ఎవరు?. ఇప్పుడు సీబీఐ విచారణ కావాలని ఎలా అడుగుతున్నారు. చంద్రబాబు హయాంలో ముద్రగడను హింసించారు. బ్రో సినిమాలో నన్ను కించపరిచారా? లేదో ప్రజలే చెప్పాలి. సినిమాల గురించి నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్