CM Jagan: వరద బాధితులకు జగన్ గుడ్ న్యూస్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను స్వయంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు నిత్యవసరాలు అందించామని.. ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. అలాగే రూ. 2 వేలు ఆర్థికసాయం చేశామని గుర్తు చేశారు. గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ఉంచుతామన్నారు. ఇటీవల వరదల వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు కూడా రూ.2వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు.

కటాఫ్ అయిన ఇళ్లకు కూడా రేషన్ అందజేస్తామన్నారు. ఇప్పటికే వరద బాధితులకు 25 కేజీల బియ్య, కందిపప్పు, నూనె, కూరగాయలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనతో చెప్పొచ్చని.. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే ఈ ప్రభుత్వ తాపత్రయం అన్నారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదన్నారు.

వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని.. ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామన్నారు. నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని.. అధికారులు వారంపాటు గ్రామాల్లోనేఉంటారన్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్