వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. భయాందోళనలో స్థానికులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో వరంగల్‌ నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. దీంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వర్షం కొంత గ్యాప్ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరంగల్‌కు మరో ప్రమాదం పొంచి ఉంది. భద్రకాళి చెరువుకు గండి పడింది. వర్షాలు తగ్గినప్పటికీ.. ఎగువ ప్రాంతం నుంచి  భద్రకాళి చెరువుకు భారీగా వరద రావడంతో ఈ ఘటన  చోటుచేసుకుంది. పోతననగర్ వైపు కట్ట కోతకు గురైంది. దీంతో పోతననగర్, సరస్వతి నగర్, భద్రకాళి ఆలయ పరిసన ప్రాంత వాసులు భయాందోళన  చెందతున్నారు.

అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రకాళి చెరువు నుంచి వస్తున్న నీటిని దారి మళ్లించి.. దిగువ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో దిగువ ప్రాంత కాల‌నీ వాసుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.అలాగే గండి పూడ్చే ప‌నికోసం సిబ్బందిని అక్క‌డికి త‌ర‌లిస్తున్నారు.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్