అమెజాన్‌లో మరోసారి గొప్ప ఆఫర్లు.. డిస్కౌంట్ల వివరాలివే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా ఇండిపెండెన్స్ సమీపిస్తున్నందున మరోసారి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లను తీసుకొస్తోంది. ఈ కొత్త సేల్‌కు సంబంధించిన డేట్స్‌ను రివీల్ చేసింది. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై.. నాలుగు రోజుల తర్వాత అంటే ఆగస్టు 9వ తేదీన ముగియనుంది. అయితే ఇదివరకటిలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే సేల్ యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

అమెజాన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు ఇతర వస్తువులన్నింటిపైనా 40 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. అంతేకాదు SBI బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించే వ్యక్తులు 10 శాతం తగ్గింపును పొందనున్నట్లు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది. Samsung, OnePlus, Realme వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఈ సేల్ టైమ్‌లో ఆఫర్లలో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో ఈ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

అమెజాన్ సేల్‌లో కొత్త ల్యాప్‌‌టాప్ లేదా వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను కొనాలని చూస్తుంటే, అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ల్యాప్ టాప్స్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్‌వాచెస్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాదు యాపిల్ సహా ఇతర ప్రముఖ బ్రాండ్ల టాబ్లెట్లపై సేల్ ద్వారా 50 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్