High Court: ఈ నెల 31 వరకు గ్రూప్-1 పరీక్ష ఫలితాలు ప్రకటించొద్దు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను ఈ నెల 31 వరకు ప్రకటించవద్దని  హైకోర్టు ఆదేశించింది.  గ్రూప్-1  ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు విచారణ  నిర్వహించింది. ఈ పిటిషన్ పై టీఎస్‌పీఎస్‌సీ ఇవాళ  తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు  చేసింది. మరోవైపు ఈ విషయమై వాదనలు విన్పించేందుకు  సోమవారం వరకు  సమయం కావాలని  టీఎస్‌పీఎస్ సీ  హైకోర్టును అభ్యర్థించింది. సోమవారంనాడు  అడ్వకేట్ జనరల్ వాదనలు విన్పిస్తారని  టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. అయితే  అప్పటివరకు   గ్రూప్-1 పరీక్ష ఫలితాలను విడుదల చేయవద్దని  హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు ఫలితాలను వెల్లడించబోమని  టీఎస్‌పీఎస్‌సీ కూడ హైకోర్టుకు తెలిపింది.

ఈ ఏడాది జూన్  11న నిర్వహించిన గ్రూప్  1  ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని  కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షలో చోటు చేసుకున్న ఇబ్బందులను పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి  నిర్వహించాలని  కోరారు. 2022 అక్టోబర్ మాసంలో  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను  నిర్వహించారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. అయితే  2022 అక్టోబర్ మాసంలో పాటించిన నిబంధనలను 2023 జూన్  11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఎందుకు పాటించలేదని పిటిషనర్లు ప్రశ్నించారు.

ఈ విషయమై ఈ ఏడాది జూన్  22న  హైకోర్టులో విచారణ జరిగింది.  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కీలక అంశాలను ఎందుకు  విస్మరించారని  హైకోర్టు టీఎస్‌పీఎస్‌సీని ప్రశ్నించింది. ఈ పరీక్షకు  3.80 లక్షల మంది పరీక్షలు రాశారు. అయితే  టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయో మెట్రిక్ వంటి అంశాలను  టీఎస్‌పీఎస్‌సీ విస్మరించిందని పిటిషనర్లు  హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్