‘పేకమేడలు’తో వస్తున్న ‘బాహుబలి’ సేతుపతి

బాహుబలి’ చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ ‘పేకమేడలు’ అనే చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘నా పేరు శివ’,’అంధఘారం’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అయిన అనూష కృష్ణ తెలుగు తెరకి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వారితో పాటూ ఈ చిత్రానికి 50 మంది నూతన నటీ నటులతో పాటు ఎంతో ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ పని చేశారు. ‘అంగమలి డైరీస్’, ‘జల్లికట్టు’ వంటి చిత్రాలకు సౌండ్ డిజైన్ చేసిన  రంగనాధ్ రేవి ఈ చిత్రానికి పని చేశారు. ఈ చిత్రం ద్వార నీలగిరి మామిళ్ళ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్‌లో నిర్మించిన ‘పేకమేడలు’ చిత్రం పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

హైదరాబాద్ బస్తీ, సిటీని కలగలిపిన 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చెన వేసిన కథానాయకుడు వినోద్ కిషన్ లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్నారు. పేకమేడలు టైటిల్‌కు తగ్గట్టుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. వైవిద్యమైన స్టోరీలైన్‌తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ఇదే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

తారాగణం: వినోద్ కిషన్, అనూష క్రిష్ణ
సాంకేతిక విభాగం :
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
రచన & దర్శకత్వం : నీలగిరి మామిళ్ళ
నిర్మాత : రాకేష్ వర్రే
సహా నిర్మాత: వరుణ్ బోర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేతన్ కుమార్
లైన్ ప్రొడ్యూసర్: అనూష బోర
డి ఓ పి: హరిచరణ్.కె
సంగీతం: స్మరన్
సౌండ్ డిసైనర్: రంగనాధ్ రేవి
సౌండ్ మిక్సింగ్: కన్నన్ గన్ పత్
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: సృజన అడుసుమిల్లి – హంజా అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: మేఘన శేషవపురి
స్క్రీన్ ప్లే : హంజా అలీ -శ్రీనివాస్ ఇట్టం-నీలగిరి మామిళ్ళ
డైలాగ్స్ & లిరిక్స్ : భార్గవ కార్తీక్
పీఆర్వో: మధు వి ఆర్

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్