24.8 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

‘జవాన్’ మూవీ ప్రివ్యూకు డేట్ టైమ్ ఫిక్స్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ‘పఠాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’. ఈయన కేవలం హిందీ సినిమాలు చూసే వారికి మాత్రమే కాదు, ఇటు సౌత్ లోను ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘పఠాన్’ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 55 కోట్ల రేంజ్‌లో నెట్ కలెక్షన్స్‌ను కలెక్ట్ చేసి వావ్ అనిపించింది. ఇక రెండో రోజు కూడా కేక పెట్టించింది. ఈ సినిమా రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

‘పఠాన్’ తర్వాత తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో నటిస్తోన్న సినిమా ‘జవాన్’. ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ఇది. ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ‘జవాన్’ ప్రివ్యూకి డేట్, టైమ్ ఖరారైంది. జూలై 10, ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్న‌ట్లు కింగ్ ఖాన్ షారూక్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార తొలిసారి నటిస్తోంది. బాలీవుడ్‌లో ఈమెకు తొలి చిత్రం. ప్రియమణి మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది.

‘జవాన్’ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఈ మూవీ ఎలా ఉండ‌బోతుందా? అస‌లు షారూక్ ఖాన్ స్టార్ డ‌మ్‌ను అట్లీ ఎలా చూపించ‌బోతున్నారు? అస‌లు సినిమా అన్నీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటుందా? అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. సినీ ప్రేక్ష‌కులు, మీడియా వ‌ర్గాలన్నీ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో ప్రివ్యూ డేట్‌, టైమ్ ప్ర‌క‌టించారు. దీంతో సినిమాపై జాతీయ స్థాయిలో సోష‌ల్ మీడియా స‌హా ఇత‌రత్రా వాటిలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి

క్యాలెండ‌ర్‌లో జ‌వాన్ ప్రివ్యూ డేట్‌ను మార్క్ చేసుకోండి. మాతో పాటు కౌండ‌ట్ డౌన్‌లో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు షారూక్ ఖాన్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని విధంగా చూడ‌బోతున్నారు. ఈ సినిమాటిక్ జ‌ర్నీ ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన అనుభూతిని అందిచ‌నుందన‌టంలో సందేహం లేదు. మ‌రింత ఎగ్జ‌యిట్‌మెంట్‌, అప్‌డేట్స్ కోసం ఎదురు చూసేలా ప్రివ్యూ డేట్ అనౌన్స్‌మెంట్ సిద్ధం చేసింది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మర్ప‌ణ‌లోషారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత‌గా జ‌వాన్ సినిమాను నిర్మిస్తున్నారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్