35.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

కొత్త అవతారం ఎత్తిన మల్లారెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: తన పంచ్ డైలాగ్‌లు, డ్యాన్స్‌లతో వార్తల్లో నిలిచే మల్లారెడ్డి ఈ సారి గొర్రెలను కాసారు. గొర్రెల కాపరి గెటప్‌లో తళుక్కున మెరిసి అందరిని ఆశ్చర్యపరిచారు. గురువారం మేడ్చల్ మండలం గౌడావెల్లి గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమనికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మండలానికి మొత్తం 15 యూనిట్లు కేటాయించామని వాటిలో ఒక్క యూనిట్‌లో 21 గొర్రెలు ఉంటాయి అని అన్నారు. అనంతరం తన ట్రేడ్ మార్కు విన్యాసాలకు తెరలేపారు. గొర్రెల కాపరిలా తలపై కంబళి కప్పుకుని, కర్ర చేతపట్టుకుని గొర్రెలు కాశారు. వాటిని సమీపంలోని చిట్టడవికి మళ్లించి గొర్రెల కాపరిలా ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తొమ్మిదేళ్లకు ముందు ఏ ప్రభుత్వం కూడా కుల సంఘాలను ఆదుకోలేదని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక ప్రతి కుల సంఘాన్ని ఆదుకుంటున్నారని తెలిపారు. కురుమ యాదవులకు ఇంకా లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. తెలంగాణలో మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశం, జడ్పిటిసి శైలజ, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దానంద్ యాదవ్, మాజీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, డబిల్ పూర్ పిఎసిఎస్ చైర్మన్ సురేష్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పెంటమ్మ, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాగ్యరెడ్డి యూనిస్ పాషా, రవీందర్ గౌడ్ తదిరులు పాల్గొన్నారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్