నేడు రేపల్లెకి టీడీపీ అధినేత చంద్రబాబు

స్వతంత్ర వెబ్ డెస్క్: చెరుకుపల్లి మండలం ఉప్పాల వారి పాలెం గ్రామంలో మృతి చెందిన ఉప్పాల అమర్నాథ్ కు నివాళులర్పించేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు ఉప్పాలవారిపాలెం వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబీకులను పరామర్శిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16న చెరుకుపల్లి మండలం రాజోలు వద్ద పాము వెంకటేశ్వరరెడ్డి, అతని స్నేహితులు ముగ్గురు కలిసి ట్యూషన్‌కు వెళుతున్న అమర్‌నాథ్‌ను కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరగాలని, నేరస్థులకు శిక్ష పడాలని శనివారం రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ రాస్తారోకో నిర్వహించారు. హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నేరస్థులకు శిక్ష పడే వరకు తాము పోరాడతామని తెలిపారు.

 

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్