25.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ఒక్క ట్వీట్ వంద కోట్ల వ్యూస్‌.. ట్విట్టర్‌లో నయా రికార్డు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఒక్క ట్వీట్ వంద కోట్ల వ్యూస్‌ని తెచ్చి పెట్టింది. అవును మీరు చదివింది నిజమే.. ఒక ఫోటోకి వేలల్లో వ్యూస్ రావడానికి ఎంతో కష్టపడుతుంటారు.. అలాంటిది ఒక ట్వీట్‌కి మాత్రం వంద కోట్ల వ్యూస్ రావడం మాములు విషయం కాదు. అందులో ఈ ట్వీట్ చేసింది సెలబ్రిటీ కూడా కాదు. మరి ఇన్ని వ్యూస్ ఎలా వచ్చాయి.. అసలు ఆ ట్వీట్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఒక్కసారి ఈ స్టోరీ చదవండి.

ఆమె చేసిన ట్వీట్‌కి భూమ్మీద ఉన్న జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ ట్వీట్‌ను చూడడంతో ట్విట్టర్‌లోనే ఇది కొత్త చరిత్రను సృష్టించింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో తెలుసా? ‘గూగుల్‌లో చూడకుండా ఒక ప్రసిద్ధ చారిత్రక యుద్ధం పేరు చెప్పండి’. ఈ ట్వీట్‌ ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించింది. నెల రోజుల్లోనే 100 కోట్ల వీక్షణలు సొంతం చేసుకున్న ఆ ట్వీట్ చేసిన ఖాతాకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య కేవలం 11 వేలే కావడం మరో విశేషం. ఈ ట్వీట్ 100 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో దాని పోస్టు చేసిన సారా బెల్లమ్ అనే యూజర్ ‘గుడ్ షాంపేన్‌తో పండుగ చేసుకున్నారు.

అయితే ఇది ఎలా సాధ్యమైందని షాకవుతుంటే.. మరికొంతమంది ట్విట్టర్ మెట్రిక్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. దీనిని 2,127 మంది రీట్వీట్ చేయగా, 85.5 వేల కోట్స్, 18.9 వేల లైకులు, 10.5 బుక్‌మార్క్స్ సొంతం చేసుకుంది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్