పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు: సింగిరెడ్డి

స్వతంత్ర, వెబ్ డెస్క్: పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది BG I I హైబ్రిడ్ విత్తనాలని అన్నారు. ప్యాకెట్ ఒక్కింటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర 450 గ్రాములకు రూ 853/- అని తెలిపారు. పత్తి విత్తనాల ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమైనా ధరల నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని అన్నారు.

కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి డీలర్ల లైసెన్స్ లు రద్దుకు వెనుకాడబోమని తెలిపారు. అవసరమైన దానికన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సీజన్‌లో 65 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని అంచనావేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు 58,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయన్నారు. మార్కెట్ లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్