‘ప్రతీ ఈవీఎం – వీవీపీఏటీలను క్షుణ్ణంగా చెక్ చేయండి’

స్వతంత్ర, వెబ్ డెస్క్: వరంగల్ లో పేరుగాంచిన ఏనుమాముల మార్కెట్ లో ఈరోజు నుండి 23 వ తేదీ వరకు జరిగే ఈవీఎం ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. ప్రతీ ఈవీఎం -వీవీపీఏటీలను క్షుణ్ణం గా చెక్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎలక్షన్ సెక్షన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ.. ఈసీఐఎల్ కంపెనీకి చెందిన ఇంజనీర్లు చేస్తున్న ఈవీఎం – వీవీపీఏటీ ల చెకింగ్ ప్రక్రియ అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరగాలన్నారు. తప్పకుండా వారందరూ హాజరయ్యేలా చూడాలని ఎలక్షన్ సెల్ అధికారులకు కలెక్టర్ తెలిపారు.

చెకింగ్ ప్రక్రియ లైవ్ రికార్డింగ్ అవుతుందని… ప్రతీ బటన్ వర్కింగ్ లో ఉందా లేదా అని, అలాగే సింబల్ లోడింగ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదరవుతున్నాయా అనే తదితర అంశాల పైన పక్కాగా ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరగాలని కలెక్టర్ తెలిపారు. 1384 బ్యాలెట్ యూనిట్ లు, 1081 కంట్రోల్ యూనిట్లు, 1168 – వీవీపీఏటీ లను ఈ నెల 23 వరకు ఈసీఐఎల్ కంపెనీ ఇంజనీర్లు చెక్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు శ్రీ వాత్స, అశ్విని తానాజీ వాకాడే, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ సుభాన్ తదితరులు ఉన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్