స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ. 1లక్ష రూపాయల ప్రభుత్వ సాయం ప్రకటించడంతో దరఖాస్తుల సంఖ్య అర లక్ష దాటినట్లు వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్. బీసీ సంక్షేమ శాఖపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని సమీక్షించారు. దరఖాస్తుధారు ఎవర్నీ ప్రత్యక్షంగా కలువాల్సిన అవసరం లేదని.. పూర్తిగా https://tsobmms.cgg.gov.in వెబ్సైట్ లో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ధరఖాస్తుకు రెండు సంవత్సరాల క్రితం ఆదాయ సర్టిఫికెట్లు పనిచేస్తాయని తెలిపారు. ఇన్కం సర్టిఫికెట్ల జారీకోసం కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సరళమైన అప్లికేషన్ ను మొబైల్ నుండి పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ల ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ సైట్ ని మంత్రి గంగుల ప్రారంబించారు. https://bchostels.cgg.gov.in ద్వారా హాస్టళ్ సీటు కోసం అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
అరలక్ష దాటిన వెనుకబడిన వర్గాల 1లక్ష సహాయం దరఖాస్తులు
0
479
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


