తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా కాగా 2021లో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. కట్నకానుకల కింద కోటి రూపాయలకు పైగా ఇచ్చారు.

అయితే అదనపు కట్నంతో పాటు అసహజ శృంగారం చేయాలని బలవంతం చేసేవారని కోర్బా ఎస్పీకి ఆమె ఫిర్యాదుచేశారు. అయితే ఎస్పీ చర్యలు తీసుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సందీప్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్