స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవ ఉత్సవాలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన సుపరిపాలన ఏంటి? అని ప్రశ్నించారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి మురళీధర్ రావు. బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మా నాయకుల మధ్య ఏటువంటి విబేధాలు లేవన్నారు. మాకంటూ ఒక్క అధ్యక్షుడు ఉన్నాడు..ఆయనే కిందే మేమంతా పని చేస్తామని అన్నారు. ఈ విబేధాలు అన్నీ మీడియా సృస్టే అని తేల్చి చెప్పారు.
కేసిఆర్ ను గద్దె దింపడమే…మా అందరి లక్ష్యమని మరొక్కసారి గుర్తుచేశారు. గతంలో రెండు సార్లుకు బీజేపీ కన్న కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చారని అన్నారు. వాళ్లు గెలిచాక ఏమైంది అనేది అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని అనుకుంటున్నారు. బీఅర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు.