స్వతంత్ర, వెబ్ సైట్: మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కొల్లాపూర్ నియోజక వర్గ నాయకులు జగదీశ్వర్ రావ్ లతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా భేటీ అయ్యారు. మల్లు రవి, జగదీశ్వర్ రావ్ ల ఇండ్లకు వెళ్లి వారితో చర్చలు జరిపారు. రెండు గంటలకు పైగా వారితో రాజకీయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జూపల్లి కాంగ్రెస్ పార్టీ లో చేరుతారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


