ఫ్రీగా ‘ఆదిపురుష్‌’ సినిమా టికెట్లు.. షరతులు వర్తిస్తాయి

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ మేనియానే నడుస్తోంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆదిపురుష్‌’ సినిమా టికెట్లను 10వేల మందికిపైగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి మాత్రమే టికెట్లు ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు ఈ https://bit.ly/CelebratingAdipurush.. లింక్ క్లిక్ చేసి అందులో పొందుపరిచిన దరాఖాస్తులో వివరాలు నింపాల్సిందిగా కోరింది. ఏమైనా సందేహాలు ఉంటే 95050 34567 నెంబరుకు ఫోన్‌ చేయవచ్చని సూచించింది.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్