తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించింది: కేటీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మం దండుమల్కాపూర్ లో గ్రీన్ ఇండీస్ట్రియల్ పార్క్ లో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు. పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందని అన్నారు. తెలంగాణలో సమగ్ర, సమత్యులత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.

TS – ఐపాస్ విధానంలో 15 రోజుల్లో పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెప్పారని అన్నారు. మానవ చరిత్రలో మూడవ అతిపెద్ద కార్యక్రమం మన హరితహారం కార్యక్రమం అని అన్నారు. భవిష్యత్తు తరాలకు పచ్చటి వాతావరణం అందిస్తున్నామని వివరించారు. పల్లె పాలనలో 30 జాతీయ స్థాయి అవార్డులు మన పల్లెలు సాధిస్తున్నాయని తెలిపారు. పట్టణాలు కూడా జాతీయ అవార్డు లు అందుకుంటున్నాయన్నారు.

తెలంగాణలో మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ సంతోషంగా ఉన్నరు. తెలంగాణను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగు అయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ ని పొగిడారు…. ఆయన ఎన్నో దేశాలు తిరుగుతారు… మన హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి జరిగింది అని కితాబు ఇచ్చారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజుకు కూడా కరంట్ కోతలు ఉన్నాయి. పక్కా రాష్ట్రాల్లో వెళ్లి ఎలాంటి పరిస్థితి ఉందొ తెలుసుకోండి.. అని ప్రజలకు వివరించారు.

నెస్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని.. 60 ఏళ్లలో జరగని పని ఈ తొమ్మిది ఏళ్లలో మన ముఖ్యమంత్రి చేసి చూపారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుందని అమెరికా ఇంజనీర్లు అన్నారు..అది తెలంగాణకు దక్కిన గొప్ప గౌరవం. ఐటీ ఎగుమతులను పెంచాము. ధాన్యం దిగుబడులు రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. అన్ని రంగాల్లో తెలంగాణ అఖండ విజయాలను సాధించింది. దండుమల్కాపూర్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ లో వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని వెల్లడించారు కేటీఆర్.

Latest Articles

పవర్ స్టార్ ఓజీ 2 ఆగిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఓజీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్