రైలు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం సాయానికి అదనంగా ఈ పరిహారం ఇవ్వాలని సూచించారు. కాగా బాలాసోర్‌లో గురుమూర్తి ఉంటుండగా.. పెన్షన్ కోసం స్వస్థలం వచ్చి వెళ్తుండగా రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రానికి చెందిన బాధితులను గుర్తించే పనిలో ఉన్నట్లు వివరించారు.

 

Latest Articles

కవిత బాయి బాటలో ఉద్రిక్తత

కవిత బాయి బాటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 భూగర్భ గనిలో.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత బాయిబాట నిర్వహించారు. గనిలోకి అనుమతించకపోవడంతో.. పోలీసులకు, టీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్