అదే నా చివరి మ్యాచ్.. టెస్టులకు వార్నర్ రిటైర్మెంట్

స్వతంత్ర, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులకు ఆస్ట్రేలియా జట్టు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్చపరిచాడు. 2024 జనవరిలో పాకిస్థాన్‌తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించాడు. కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న వార్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 7న ఇండియాతో జరగనున్న WTC ఫైనల్‌తోపాటు యాషెస్‌ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తానని ఈ సందర్భంగా తెలిపాడు. కెప్టెన్సీ విష‌య‌మై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో వార్న‌ర్‌కు విభేదాలు కూడా నడుస్తుండడంతో టెస్టుల‌కు గుడ్ బై చెప్ప‌ినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులు ఆడిన వార్నర్ 188 ఇన్నింగ్స్‌ల్లో 45.57 సగటుతో 8,158 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలతో పాటు 34 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు వార్నర్ తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి క్రికెట్‌తో పాట, వన్డేలకు కూడా రిటైర్మెంట్ చెప్పనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించాడు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్