స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నేడు(జూన్ 1) ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు . నేటి ఉదయం 11గంటల 30నిమిషాలకు సీఎస్ ఉద్యొగ్య సంఘాలతో క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ భేటీకి ఏపీ జెఏసి అమరావతి రాష్ట్ర కమిటీ తరపున బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరవుతున్నట్లు తెలిపారు. తమ జేఏసీ తరపున ఫిభ్రవరి 13న సిఎస్కి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలోని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆహ్వానించారని తెలియజేశారు బొప్పరాజు. గత 84 రోజులుగా చేస్తున్న ఉద్యమం కొనసాగుతుందని.. ఉద్యమాన్ని చులకనగా చూస్తే ఉద్యమం తమ చేతులో ఉండదని హెచ్చరించారు బొప్పరాజు. గుంటూరులో జూన్ 8న ఏపీజేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. సదస్సుకు సంబందించిన పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చిందని.. ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదని బొప్పరాజు తెలిపారు. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చిందని బొప్పరాజు వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రధాన డిమాండ్లు మాత్రం పరిష్కారం కాలేదని బొప్పరాజు వెల్లడించారు. జూన్ 10లోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని బొప్పరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ భేటీ
0
435
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


