స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై జైలులో ఉంటున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ స్కాంలో సిసోడియాపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని జస్టిస్ దినేశ్ కుమార్ శర్మతో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది. సిసోడియా ప్రభావవంతమైన వ్యక్తి అని.. ఇప్పుడు బెయిల్‌పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.
సిసోడియాకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
0
414
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


