కర్ణాటకలో మంత్రులకు శాఖలు కేటాయించిన ప్రభుత్వం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖతో పాటు కేబినెట్‌ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌, సమాచార, ఐటీ, మౌలికసదుపాయాల అభివృద్ధి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫామ్స్‌ వంటి శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి డీకేకు భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను కేటాయించారు.

మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వరకు హోంశాఖ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖలు దక్కాయి. ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ, వృద్ధులు, దివ్యాంగుల సాధికారిత శాఖలు అప్పగించారు. మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్పకు ప్రాథమిక, ఉన్నత విద్య శాఖ, రామలింగారెడ్డికి రవాణాశాఖ కేటాయించారు. ఇక దినేశ్‌ గుండురావుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కృష్ణ బైరెగౌడకు రెవెన్యూ, సతీశ్ జర్ఖిహోళికి ప్రజా వ్యవహారాలు, హెచ్‌సీ మహదేవప్పకు సామాజిక సంక్షేమ శాఖలు ఇచ్చారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్