అదరగొట్టిన మామా అల్లుడి ‘బ్రో’ పోస్టర్

స్వతంత్ర వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తూనే ఉన్నాడు. వరుసపెట్టి తన సినిమాల అప్టేడ్స్ ఇస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. మేనల్లుడు సాయితేజుతో కలిసి నటిస్తున్న ‘బ్రో ది అవతార్’ మూవీ నుంచి ఇప్పటికే ఇద్దరి పోస్టర్లు విడివిడిగా విడుదల చేయగా.. తాజాగా ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ స్టార్ స్టైలిష్ బైక్‌పై కాలు పెట్టి ‘శ్రీకృష్ణుడి’లా ముందు నిలబడగా, అతని వెనుక చేతులు కట్టుకుని ‘అర్జుని’డిలా తేజు నిలబడి ఉన్నాడు. మోడ్రన్ దేవుడి కాన్సెప్ట్ చిత్రం కావడంతో పోస్టర్ అలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్‌ను ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్ చేస్తున్నారు. కాగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ మూవీ జులై 28న విడుదల కానుంది. కాగా ఇప్పటికే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్