మన చంద్రన్న శ్రీరాముడు… జగన్ సైకో.. మహానాడులో లోకేష్ వ్యాఖ్యలు

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ మహానాడుకి వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం అంటూ రాజమహేంద్రవరం బహిరంగ సభలో నారా లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
లోకేష్ వ్యాఖ్యలు:
–>రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది.
–>గోదావరి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇక్కడ ప్రజల మనస్సు అంత స్వచ్ఛంగా ఉంటుంది.
–>గోదారొళ్ల యటకారం, మమకారం రెండూ సూపర్.
–>తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం.
–>తెలుగుదేశం పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
–> తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్.
–> రాముడైనా, కృష్ణుడైనా, రావ‌ణుడైనా అది ఎన్టీఆర్.
–>కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది ఎన్టీఆర్.
–> ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్.
–> ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది ఎన్టీఆర్.
–> రూ.2 కే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మధ్యాహ్న భోజన పధకం ఇలా సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్.
–> మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి అన్నగారు అయ్యారు ఎన్టీఆర్.
–> పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలి. పార్టీ నడపడానికి క్యాలిబర్ ఉండాలి.
–> తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి హిస్టరీ ఉంది. పార్టీ ని నడుపుతున్న బాబు గారికి క్యాలిబర్ ఉంది.
–>ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టింది చంద్రన్న.
–>హైటెక్ సిటీతో చరిత్ర సృష్టించింది చంద్రన్న, కియా, హెచ్సిఎల్, ఫ్యాక్స్ కాన్, టిసిఎల్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధికి అర్ధం చెప్పారు చంద్రన్న.
–>చంద్రన్న భీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుక, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ లాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది, అన్న క్యాంటిన్ తో పేదవాడికి అన్నం పెట్టింది మన చంద్రన్న.
–> తెలుగుదేశం పార్టీ, మన అధినేతల రికార్డులు కొట్టే మగాడు పుట్టలేదు, పుట్టడు.
–>టిడిపి అంటే తెలుగు వారు గర్వంతో మీసం మెలేసే పార్టీ…వైసిపి అంటే తెలుగు వారు తలదించుకునే పార్టీ.
–>టిడిపి అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ…వైసిపి అంటే గలీజు పార్టీ.
–> మనది సైకిల్ పాలన…వైసిపి ది సైకో పాలన.
–> మన చంద్రన్న శ్రీరాముడు… జగన్ సైకో.
–>చంద్రన్న ది అభివృద్ధి…జగన్ ది అవినీతి.
–> చంద్రన్న విజనరీ… జగన్ ప్రిజనరి.
–>చంద్రన్న నిలబెడితే…జగన్ పడగొడతాడు.
–> చంద్రన్న హీరో…జగన్ జీరో.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్