స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ గోళ్లపాడు లో 5 సంవత్సరాల పసికందును అగంతకుడు చెరచబోయాడు. పాప ఒంటరిగా ఆడుకుంటుండగా అగంతకుడు పైచాచికత్వాన్ని చూపబోగా… చుట్టుపక్కల వారు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన ఖమ్మం రూరల్ పోలీసులు నిందితున్ని అదుపులో తీసుకున్నారు. నిందితుడు బోయినపల్లి వీరబాబు అలియాస్ వీరేశం గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.