స్వతంత్ర, వెబ్ డెస్క్: ఐపీఎల్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పాడు. గుజరాత్‌తో ఆడుతున్న ఫైనల్ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ‘‘2010 నుంచి నన్ను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ఐపీఎల్‌లో రెండు జట్ల తరఫున (ముంబయి, చెన్నై) ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడాను. 14సీజనల్లో 11 ప్లేఆఫ్స్, 8 ఫైనల్స్‌లో ఆడాను. ఇప్పటివరకు 5 ట్రోఫీల విజయంలో పాలు పంచుకున్నాను. ఇవాళ ఆరో ట్రోఫీ గెలుస్తానని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేశాడు.