నో-ఫ్లై’ జాబితాలోకి మాజీ ప్రధాని

స్వతంత్ర వెబ్ డెస్క్: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంతో దివాళా అంచుకి చేరిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా రాజకీయ అస్థిరతతో సతమతం అవుతోంది. దీనికి కారణం అక్కడి ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేఖంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేయడమే.

ఇటీవల ఆయన అరెస్ట్ సమయంలో, ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కరాచీ, లాహోర్, క్వెట్టా, పెషావర్ నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆర్మీ కంటోన్మెంట్లే టార్గెట్‌గా దాడులు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఉన్నా.. సైన్యమే పరోక్షంగా అధికారం చెలాయిస్తోంది. నెమ్మనెమ్మదిగా అల్లర్లలో పాల్గొన్నవారిని అరెస్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, ఆయన పార్టీకి క్రమంగా రాజీనామాలు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ బెదిరింపులతో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు దూరం అవుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ విదేశాలకు ప్రయాణించకుండా ‘నో-ఫ్లై’ జాబితాలోకి ఇమ్రాన్ ఖాన్‌ను తీసుకువచ్చింది.

విదేశాల్లో తనకు ఎలాంటి ఆస్తులు, వ్యాపారాలు లేవని, బ్యాంకు అకౌంట్లు లేవని విదేశాలకు వెళ్లే ఆలోచన లేదని, తనను నో ఫ్లై జాబితాలో ఉంచినందుకు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. థాంక్స్ చెప్పారు ఇమ్రాన్ ఖాన్. ఆయన భార్య బుష్రాబీబీ, ఇతర పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి చెందిన పలువురు నేతలు దేశం వదిలి వెళ్లకుండా నిషేధించింది. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 600 పీటీఐ నాయకులపై నో-ఫ్లై జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా పీటీఐ పార్టీకి చెందిన వారు దేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని వారిని అడ్దుకున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ జాబితాలో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ పేరు కూడా ఉంది. వీరితో పాటు కీలక నేతలైన మురాద్ సయీద్, మలీకా బొఖారీ, ఫవాద్ చౌదరి, హమ్మద్ అజార్, ఖాసిం సూరి, అసద్ ఖైజర్, యాస్మిన్ రషీద్ మరియు మియాన్ అస్లాం ఇక్బాల్ పేర్లు ఉన్నాయి.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్