26 మంది పిల్లలను కాపాడిన పోలీసులు

స్వతంత్ర వెబ్ డెస్క్: బాలకార్మికులుగా మార్చేందుకు వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 26 మంది పిల్లలను తెలంగాణ, రైల్వే అధికారులు కాపాడారు. సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో మైనర్ల అక్రమ రవాణాను అడ్డుకొని 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, భేటీ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలను ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. వీరందరినీ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్ధారణ అయింది.. దీంతో స్వచ్ఛంద సంస్థతో కలిసి అధికారులు పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్‌ నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి పిల్లలను రక్షించారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 374, 341ల కింద సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

నిందితుల నుంచి కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్‌లోని ప్రభుత్వ హోమ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్, భేటీ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అడిషనల్ డీజీ శిఖాగోయల్‌ అభినందించారు.

Latest Articles

NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజి నేపథ్యంలో NTAలో ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్