శరత్ బాబు మృతి పట్ల ప్రధాని మోదీ విచారం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘శ్రీ  శరత్ బాబు గారు విలక్షణమైన, సృజనాత్మక నటుడు.. సుదీర్ఘ సినీ జీవితంలో అనేక భాషల్లో, విభిన్నమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు.. ఆయన మరణించడం విచారకరం.. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు శరత్ బాబు మరణించడం బాధాకరమని ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

కాగా అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాద్ ఫిలిం చాంబర్ తీసుకురాగా.. సీనియర్ నటులు, ఫిలిం చాంబర్ సభ్యులు, ‘మా’ ప్రతినిధులు నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని చెన్నై తరలిస్తున్నారు. రేపు ఉదయం చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్